సీఎం చంద్రబాబుకు నాన్ బెయిలబుల్ వారెంట్

సీఎం చంద్రబాబుకు నాన్ బెయిలబుల్ వారెంట్

13-09-2018

సీఎం చంద్రబాబుకు  నాన్ బెయిలబుల్ వారెంట్

ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుపై మహారాష్ట్రలోని ధర్మాబాద్‌ కోర్టు నాన్‌ బెయిలబుల్‌ వారెంట్‌ జారీ చేసింది. ఈ నెల 21న చంద్రబాబుతో పాటు మిగతా 14 మందిని కోర్టులో హాజరు పరచాలని ధర్మాబాద్‌ కోర్టు ఆదేశించింది. 2010లో బాబ్లీ ప్రాజెక్టుకు వ్యతిరేకంగా ధర్నా చేసేందుకు వెళ్లిన చంద్రబాబుతోపాటు 14  మందిపై కేసు నమోదైంది. ఎనిమిది ఏళ్లుగా ఒక్క నోటీసు కూడా లేకుండా ఒకేసారి నాన్‌ బెయిలబుల్‌ వారెంట్‌ జారీ చేయడంపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. తిరుమల శ్రీవారి సేవలో వుండగానే నోటీసులు వచ్చినట్లు చంద్రబాబు తెలుసుకున్నారు. కేసును కోర్టు ఈ నెల 21కి వాయిదా వేసింది. మరోవైపు కేసుపై చంద్రబాబు న్యాయ సలహాలు తీసుకుంటున్నారు. ముందస్తు నోటీసులు  ఇవ్వకుండా ఒకే సారి చంద్రబాబుపై నాన్‌ బెయిలబుల్‌ వారెంట్‌ జారీ చేయడాన్ని తెలుగుదేశం నేతలు తప్పు బడుతున్నారు. చంద్రబాబుపై నాన్‌ బెయిలబుల్‌ వారెంట్‌ జారీ కావడంతో ఏపీలో మరోసారి రాజకీయాలు వేడ్కెనున్నాయి.