ఆపరేషన్ 'గరుడ'లో నోటీసు భాగమేనా?!

ఆపరేషన్ 'గరుడ'లో నోటీసు భాగమేనా?!

14-09-2018

ఆపరేషన్ 'గరుడ'లో నోటీసు భాగమేనా?!

ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడికి మహారాష్ట్రలోని ధర్మాబాద్‌ కోర్టు నాన్‌ బెయిలబుల్‌ వారెంట్‌ జారీ చేయడంతో ఆపరేషన్‌ గరుడను కేంద్ర ప్రభుత్వం అమలు చేయవచ్చన్న వార్తలకు ఈ నోటీస్‌ నిజం చేసే విధంగా ఉన్నట్లు అంటున్నారు. నాలుగైదు రోజుల కిందట నటుడు శివాజీ కొత్త పద్ధతిలో అపరేషన్‌ గరుడ అమలుకు శ్రీకారం చుట్టిన బీజేపీ ఏపీ సీఎం చంద్రబాబును ఇరుకున పెట్టడమే లక్ష్యంగా పావులు కదుపుతోందని చెప్పి సంచలనం స ష్టించిన సంగతి తెలిసిందే. తనకు తెలిసిన విశ్వసనీయ సమాచారం ప్రకారం రానున్న రెండు మూడు రోజులలో ఏపీ సీఎం చంద్రబాబుకు నోటీసులు జారీ అవుతాయని చెప్పారు. బీజేపీ కుట్ర పూరితంగా ఏపీ సీఎం చంద్రబాబును చిక్కుల్లో పడేయడానికి, ఏపీని మరిన్ని ఇబ్బందుల్లో నెట్టడానికి పావులు కదుపుతోందని ఆయన ఆరోపించిన సంగతి తెలిసిందే.

ఎప్పుడో 2010 నాటి బాబ్లీ కేసులో చంద్రబాబుకు మహారాష్ట్రలోని ధర్మాబాద్‌ కోర్టు అరెస్టు వారెంట్‌ చేయడంతో శివాజీ చెప్పిన ఆపరేషన్‌ గరుడలో భాగంగానే ఈ అరెస్టు వారెంట్‌ అన్న భావన ఉభయ తెలుగు రాష్ట్రాల ప్రజలూ విశ్వసిస్తున్నారు. అసలీ కేసు పూర్వాపరాలు ఏమిటంటే 2010లో అప్పట్లో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రంలో విపక్ష నేతగా ఉన్న చంద్రబాబునాయుడు మహారాష్ట్ర బాబ్లీ ప్రాజెక్టుకు వ్యతిరేకంగా ధర్నా చేసేందుకు ప్రాజెక్టు వద్దకు వెళ్లేందుకు ప్రయత్నించారు. అయితే ప్రాజెక్టు సందర్శనకు అనుమతి లేదంటూ అప్పటి మహారాష్ట్ర ప్రభుత్వం చంద్రబాబుతో సహా పలువురు తెలుగుదేశం నాయకులను అరెస్టు చేసింది. ఆ తరువాత  చంద్రబాబు బెయిలు తీసుకుని విడుదల కావడానికి నిరాకరించినా మహాపోలీసులు బలవంతంగా వెనక్కు పంపించారు. ఆ తరువాత అప్పట్లోనే మహారాష్ట్ర ప్రభుత్వం చంద్రబాబు ప్రభతులపై కేసును ఉపసంహరించుకుంటున్నట్లు ప్రకటించింది. ఆ తరువాత ఈ కేసుకు సంబంధించి ఎటువంటి సమాచారం లేదు. ఇప్పుడు హఠాత్తుగా ఎనిమిదేళ్ల తరువాత ఇప్పటి వరకూ ఎటువంటి నోటీసు లేకుండా ఒక్కసారిగా చంద్రబాబుపై నాన్‌ బెయిలబుల్‌ వారెంట్‌ జారీ చేయడం అందర్నీ ఆశ్చర్యానికి గురి చేసింది. కచ్చితంగా కక్షసాధింపులో భాగంగానే ఈ నోటీసులు జారీ అయ్యాయన్న భావన సర్వత్రా కనిపిస్తున్నది.  కేంద్రంలో, మహారాష్ట్రలో అధికారంలో బీజేపీ ఉండటం, ఇటీవలి కాలంలో కేంద్ర సర్కార్‌ పైనా, బీజేపీపైనా చంద్రబాబు విమర్శలు చేస్తుండటంతో మోడీ సర్కార్‌ చంద్రబాబుకు కళ్ళెం వేయడానికి ఈ కేసును తిరగదోడిందని చెబుతున్నారు.