ప్రత్యేక ఆఫర్ ప్రకటించిన గోఎయిర్

ప్రత్యేక ఆఫర్ ప్రకటించిన గోఎయిర్

08-11-2018

ప్రత్యేక ఆఫర్ ప్రకటించిన గోఎయిర్

విమానయాన రంగంలోకి ప్రవేశించి 13 ఏండ్లు పూర్తయిన సందర్భంగా గోఎయిర్‌ ప్రత్యేక ఆఫర్‌ను ప్రకటించింది. ఈ ఆఫర్‌ కింద ప్రారంభ విమాన టికెట్టు ధరను రూ.1,313గా నిర్ణయించింది. సోమవారం ప్రారంభమైన ఈ ఆఫర్‌ 13 రోజుల పాటు (ఈ నెల 18 వరకు) అందుబాటులో ఉండనున్నది. ఇందుకోసం సంస్థ 13 లక్షల సీట్లను కేటాయించింది. ఈ ఆఫర్‌ కింద బుకింగ్‌ చేసుకున్న ప్రయాణికులు నవంబర్‌ 4, 2019లోపు ఎప్పుడైనా ప్రయాణించవచ్చునని కంపెనీ ఒక ప్రకటనలో వెల్లడించింది.