సీమకు నిజమైన దీపావళి!

సీమకు నిజమైన దీపావళి!

08-11-2018

సీమకు నిజమైన దీపావళి!

కడప ఉక్కు పరిశ్రమ సాధించేవరకు గడ్డం తీయనని రాజ్యసభ సభ్యుడు సీఎం రమేశ్‌ దీక్ష విరమించిన సమయంలో ప్రకటించిన సంగతి తెలిసిందే. రాష్ట్ర కేబినెట్‌లో ఉక్కు పరిశ్రమ ఏర్పాటుకు ఆమోదం లభించడంపై ఆయన స్పందించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ చంద్రబాబుకు కడప జిల్లా ప్రజలు రుణపడి ఉన్నారన్నారు. ఉక్కు పరిశ్రమ ప్రకటనతో సీమలో నిజమైన దీపావళి వచ్చిందన్నారు. ఉక్కు పరిశ్రమ ఏర్పాటయ్యేంతవరకు గడ్డం తీయనని ఆ రోజు ప్రకటించానని తెలిపారు. నెలలోగా సీఎం ఉక్కు పరిశ్రమ ఏర్పాటుకు శిలాఫలకం వేస్తారని అనంతరం తాను తిరుమల వెళ్లి వెంకన్నకు మొక్కు తీర్చుకుంటానని అన్నారు.