సీఎం చంద్రబాబుకు బెంగళూరులో ఘన స్వాగతం

సీఎం చంద్రబాబుకు బెంగళూరులో ఘన స్వాగతం

08-11-2018

సీఎం చంద్రబాబుకు బెంగళూరులో ఘన స్వాగతం

ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకు బెంగళూరులో ఘన స్వాగతం లభించింది. చంద్రబాబుకు మాజీ ప్రధాని దేవెగౌడ, కర్ణాటక సీఎం కుమారస్వామి స్వాగతం పలికారు. మోదీ వ్యతిరేక కూటమిపై ముగ్గురు చర్చలు జరుపుతున్నారు. మోదీ వ్యతిరేక కూటమిపై విపక్షాలను ఏకం చేస్తున్న చంద్రబాబు, ఇప్పటికే ఢిల్లీలో స్థాయిలో పలువురు నేతలతో చర్చలు జరిపారు. ఇప్పుడు దక్షిణాధినేతలతో భేటీ అవుతున్నారు. కుమారస్వామి ప్రమాణస్వీకారం సందర్భంగా కూడా మోదీ వ్యతిరేక కూటమి చర్చకు వచ్చింది. అప్పట్లో చంద్రబాబుకు దేవెగౌడ, కుమారస్వామి మద్దతు పలికారు. ఇప్పుడు ఈ ప్రయత్నాలు మరింత ఊపందుకోవడంతో మరోసారి భేటీ అయ్యారు.