తెలుగు రాష్ట్రాల్లో కార్తీక శోభ

తెలుగు రాష్ట్రాల్లో కార్తీక శోభ

08-11-2018

తెలుగు రాష్ట్రాల్లో కార్తీక శోభ

తెలుగు మాసాల్లో ఎంతో విశిష్టత కలిగిన కార్తీక మాసం ఈ రోజు ప్రారంభమైంది. దీపావళి పండుగ మరుసటి రోజు వచ్చే పాడ్యమితో కార్తీక మాసం ప్రారంభమవుతోంది. దీంతో నిన్న రాత్రి దీపావళి సంబరాల్లో మునిగిపోయిన ప్రజలు ఈరోజు తెల్లవారుజామునే లేచి పుణ్యస్నానాలు ఆచరించి శివాలయాలకు పోటెత్తారు. శివనామస్మరణతో శివాలయాలన్నీ మార్మోగుతున్నాయి. ప్రముఖ శైవ క్షేత్రాలైన శ్రీశైలం, శ్రీకాళహస్తితో పాటు పంచారామ క్షేత్రాలు, అమరావతి, భీమవరం, పాలకొల్లు, ద్రాక్షరామం, సామర్లకోటలోని క్షేత్రాలు కార్తీక శోభ సంతరించుకున్నాయి. తూర్పుగోదావరి జిల్లా రాజమహేంద్రవరం వద్ద అఖండ గోదావరిలో భక్తులు వేల సంఖ్యలో పుణ్యస్నానాలు ఆచరించి పరమ శివుడిని దర్శించుకున్నారు. కార్తీక దీపాలు వెలిగించి గోదావరిలో విడిచారు. తెలంగాణలో కీసర, వేములవాడ, చెరువుగట్టు, కాళేశ్వరం తదితర క్షేత్రాల్ల భక్తుల రద్దీ నెలకొంది.