జనగామ నుంచి కోదండరాం పోటీ?

జనగామ నుంచి కోదండరాం పోటీ?

09-11-2018

జనగామ నుంచి కోదండరాం పోటీ?

తెలంగాణ జన సమితి అధినేత (టీజేఎస్‌) కోదండరాం ఎన్నికల బరిలోకి దిగనున్నారు. అసెంబ్లీ ఎన్నికల్లో జనగామ నుంచి పోటీ చేయాలని ఆయన నిర్ణయించినట్లు సమాచారం. దాంతో, జనగామ సీటును కోదండకు కేటాయించేందుకు కాంగ్రెస్‌ పార్టీ అంగీకరించినట్లు తెలిసింది. అక్కడి టికెట్‌ ఆశిస్తున్న టీపీసీసీ మాజీ అధ్యక్షుడు పొన్నాల లక్ష్మయ్యకు మరో స్థానాన్ని కేటాయించేందుకు కాంగ్రెస్‌ సుముఖత వ్యక్తం చేసినట్లు సమాచారం. అలాగే, వరంగల్‌ తూర్పును టీజేఎస్‌కు కేటాయించేందుకు తొలుత కాంగ్రెస్‌ అంగీకరించినా ఆ తర్వాత నిరాకరించినట్లు సమాచారం. దాంతో వరంగల్‌ తూర్పు బదులు మేడ్చల్‌ స్థానాన్ని టీజేఎస్‌ కోరుతున్నట్లు తెలిసింది.