ఏపీ గిరిజన వర్సిటీకి కేంద్రం గ్రీన్ సిగ్నల్

ఏపీ గిరిజన వర్సిటీకి కేంద్రం గ్రీన్ సిగ్నల్

09-11-2018

ఏపీ గిరిజన వర్సిటీకి  కేంద్రం గ్రీన్ సిగ్నల్

ఆంధ్రప్రదేశ్‌లో గిరిజన విశ్వవిద్యాలయం ఏర్పాటుకు కేంద్రమంత్రివర్గం గ్రీన్‌సిగ్నల్‌ ఇచ్చింది. అందుకు అనుగుణంగా కేంద్రీయ విశ్వవిద్యాలయాల చట్టం-2009ను సవరణ చేసేందుకు ఆమోదం తెలిపింది. విజయనగరం జిల్లా రెల్లి గ్రామంలో ఏపీ సెంట్రల్‌ గిరిజన యూనివర్సిటీని ఏర్పాటు చేస్తున్నట్లు ప్రకటించింది. మొదటి దశ పనులకు రూ.420 కోట్లు కేటాయిస్తూ ఆమోదం తెలిపామని పేర్కొంది. ప్రధాని మోదీ నేతృత్వంలో సమవేశమైన మంత్రివర్గం ఈ నిర్ణయం తీసుకుంది. ఇది కీలక నిర్ణయమని కేంద్ర ఐటీ, న్యాయ శాఖ మంత్రి రవిశంకర్‌ ప్రసాద్‌ చెప్పారు. ఏపీకి ఏం చేశారని పేదే పదే చర్చ జరుగుతోందని, విభజన చట్టంలో పెట్టిన హామీల్లో చాలా నెరవేర్చామని తెలిపారు. వర్సిటీకి కొత్తవలస మండల రెల్లి (అప్పన్న దొరపాలెం) గ్రామ సమీపంలో ఇప్పటికే భూములను కేటాయించారు.