ఈ నెల 11న ఏపీ కేబినెట్ విస్తరణ

ఈ నెల 11న ఏపీ కేబినెట్ విస్తరణ

09-11-2018

ఈ నెల 11న ఏపీ కేబినెట్ విస్తరణ

ఆంధ్రప్రదేశ్‌లో రాష్ట్ర మంత్రివర్గ విస్తరణకు ముహూర్తం ఖారారైంది. ఈ నెల 11న మంత్రివర్గాన్ని విస్తరించాలని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నిర్ణయించినట్లు సమాచారం. ఎస్టీ, ముస్లిం మైనారిటీ వర్గాలకు మంత్రివర్గంలో చోటు దక్కే అవకాశం ఉంది. గతేడాది ఏప్రిలో మంత్రివర్గ విస్తరణ జరిగింది. నిబంధనల ప్రకారం సీఎంతో కలిపి మొత్తం 26 మంది వరకు మంత్రులుగా ఉండే అవకాశం ఉంది. అయితే ప్రస్తుతం 24 మంది మాత్రమే ఉన్నారు. దీంతో ఎప్పటి నుంచి ఖాళీగా ఉన్న రెండు మంత్రి పదవులను భర్తీ చేయాలని భావిస్తున్నారు. గతంలో ముస్లిం, మైనార్టీలకు చోటు కల్పిస్తామని చెప్పిన ముఖ్యమంత్రి, ఆ ప్రక్రియను త్వరితగతిన పూర్తిచేయాలని నిర్ణయించినట్లు తెలుస్తోంది. మైనార్టీల నుంచి మండలి చైర్మన్‌ షరీఫ్‌, ఫరూక్‌లకు అవకాశం కల్పిస్తారని సమాచారం. అంతేకాకుండా ఇటీవల మావోల చేతిలో హత్యకు గురయిన కిడారి సర్వేశ్వరరావు కుమారుడు శ్రవణ్‌కు ఎస్టీ కోటా నుంచి కోటు కల్పిస్తారని తెలుస్తోంది.