కేసీఆర్ కు మహిళా ఓట్లడిగే అర్హత లేదు

కేసీఆర్ కు మహిళా ఓట్లడిగే అర్హత లేదు

29-11-2018

కేసీఆర్ కు మహిళా ఓట్లడిగే అర్హత లేదు

తన మంత్రివర్గంలో ఒక్క మహిళకు కూడా స్థానం ఇవ్వని టీఆర్‌ఎస్‌ అధినేత కేసీఆర్‌కు మహిళలను ఓట్లు అడిగే అర్హత లేదని ఏపీ మంత్రి పరిటాల సునీత అన్నారు. కూకట్‌పల్లి నియోజకవర్గ మహిళ కాంగ్రెస్‌ ఆధ్వర్యంలో మూసాపేటలో నిర్వహించిన మహిళా గర్జనకు ఆమె ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. ప్రజాసేవకు ముందుకొచ్చిన నందమూరి ఆడబిడ్డ సుహాసినిని అత్యధిక మెజారిటీతో గెలిపించాలని పిలుపు నిచ్చారు. ఈ సందర్భంగా సుహాసిని మాట్లాడుతూ తనను గెలిపిస్తే 24 గంటలు అందుబాటులో ఉంటానన్నారు.