నేను అభివృద్ధి చేసింది సైబరాబాద్ ను మాత్రమే

నేను అభివృద్ధి చేసింది సైబరాబాద్ ను మాత్రమే

29-11-2018

నేను అభివృద్ధి చేసింది సైబరాబాద్ ను మాత్రమే

కాంగ్రెస్‌, తెలుగుదేశం తొలిసారి కలసి పనిచేయడం వెనుక ఎలాంటి స్వార్థం లేదని తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు, ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అన్నారు. హైదరాబాద్‌లోని అమీర్‌పేట, ఆసిఫ్‌నగర్‌లలో జరిగిన బహిరంగ సభల్లో కాంగ్రెస్‌ జాతీయాధ్యక్షుడు రాహుల్‌గాంధీతో కలిసి చంద్రబాబు పాల్గొన్నారు. ఈ సందర్భంగా చంద్రబాబు మాట్లాడుతూ ప్రజాస్వామ్య రక్షణే తమ ధ్యేయమని తెలిపారు. తానెప్పుడూ హైదరాబాద్‌ నగరాన్ని కట్టానని చెప్పలేదని, సైబరాబాద్‌ను మాత్రమే ఏర్పాటు చేశానని అన్నారు. కులీకుతుబ్‌షా నిర్మించిన నగరాన్ని మరింత ముందుకు తీసుకెళ్లానన్నారు. కానీ కొందరు కావాలనే తనను ఎగతాళి చేస్తున్నారన్నారు. నావల్లే తెలంగాణ సంపద పెరిగిందని ఎంపీ కవిత చెప్పారు. నావల్లే హైదరాబాద్‌ హైటెక్‌ సిటీ అయ్యిందంటూ మంత్రి కేసీఆర్‌ మెచ్చుకున్నారు. ఇప్పుడేమో నన్ను తిడుతున్నారు. నేనిక్కడకు పెత్తనం చేయడానికి రాలేదు. 13 సీట్లతో నేనిక్కడ సీఎం కాలేను. మెట్రో రైలు ప్రతిపాదన కాంగ్రెస్‌ హయాంలోనే వచ్చింది. కేసీఆర్‌ చేసిందేమీ లేదు. ఇంకా అడ్డుపడి ఆసల్యం చేశారు. కేసీఆర్‌ మోదీతో లాలూచీ పడ్డారు. మోదీ సహకారంతోనే ముందస్తు ఎన్నికలకు వెళ్లారు. కేసీఆర్‌, మోదీ, జగన్‌ అంతా ఒక్కటే అని అన్నారు.