ప్రధాని పదవికి పోటీలో లేను

ప్రధాని పదవికి పోటీలో లేను

30-11-2018

ప్రధాని పదవికి పోటీలో లేను

దేశవ్యాప్తంగా బీజేపీ యేతర పార్టీల కూటమి ఏర్పాటుకు కృషి చేస్తున్న తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు, ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తాను ప్రధాన మంత్రి పదవి పోటీలో లేనని సృష్టం చేశారు. వచ్చే లోక్‌సభ ఎన్నికల్లో బీజేపీ ఓటమి ఖాయమని పేర్కొన్నారు. దేశానికి బీజేపీ చాలా నష్టం చేస్తోందని, దేశాన్ని రక్షించుకోవడం ఇప్పుడు ప్రతి ఒక్కరి బాధ్యత అని తెలిపారు. పార్క్‌ హయత్‌ హోటల్‌లో మీడియా సంపాదకులతో ఆయన సమావేశమై పలు అంశాలపై మాట్లాడారు. రాష్ట్ర, జాతీయ మీడియా ప్రతినిధులు పలువురు దీనికి హాజరయ్యారు. గతంలో రెండు సార్లు ప్రధాని పదవి చేపట్టే అవకాశం వచ్చింది. ఆ పదవిని చేపట్టాలంటూ ఒత్తిడి కూడా వచ్చింది. అయినా నేను తిరస్కరించా. అప్పట్లో ఉమ్మడి ఏపీ రాష్ట్రం వెనుకబడి ఉన్నందున దాన్ని అభివృద్ధి చేయాలన్న ఆశయంతోనే ఆ పదవిని తీసుకోలేదు. ఇప్పుడు కూడా ఆ పదవి రేసులో నేను లేను అని చంద్రబాబు సృష్టం చేశారు. 2019 ఎన్నికల్లో బీజేపీని ఓడించి మహకూటమి అధికారం చేపడుతుందన్న నమ్మకం తనకుందన్నారు.