తెలంగాణలో టీడీపీకి పూర్వవైభవం తీసుకొస్తాం : బాలకృష్ణ

తెలంగాణలో టీడీపీకి పూర్వవైభవం తీసుకొస్తాం : బాలకృష్ణ

04-12-2018

తెలంగాణలో టీడీపీకి పూర్వవైభవం తీసుకొస్తాం : బాలకృష్ణ

తెలంగాణలో తెలుగుదేశం పార్టీకి పూర్వ వైభవం తీసుకొద్దామని సినీనటుడు, హిందుపూరం ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ అన్నారు. కూకట్‌పల్లి నియోజకవర్గంలోని బోయినపల్లిలో టీడీపీ అభ్యర్థి నందమూరి సుహాసినికి మద్దతుగా బాలకృష్ణ రోడ్‌ షో నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ టీఆర్‌ఎస్‌ ఎన్నో హమీలిచ్చి ఏ ఒక్కటి అమలు చేయలేదని విమర్శించారు. ధనిక రాష్ట్రంగా ఉన్న తెలంగాణను అప్పుల పాల్జేశారని ఆరోపించారు. పెత్తందారుల రాజ్యం తీసుకురావాలని టీఆర్‌ఎస్‌ ప్రయత్నిస్తోందని ఆయన ధ్వజమెత్తారు. టీడీపీ చేసిన అభివృద్ధి కళ్ల ముందు కనబడుతోందన్నారు. టీడీపీ ఏ ఒక్క కులానికో, మతానికో చెందిన పార్టీ కాదన్నారు. హైదరాబాద్‌ నడిబొడ్డున పుట్టిన పార్టీ టీడీపీ అని గుర్తు చేశారు. పదవుల కోసమో, కాంట్రాక్టుల కోసమే టీడీపీ కార్యకర్తలు వెంపర్లాడరని అన్నారు. అధికారంలో ఉన్నా, ప్రతిపక్షంలో ఉన్నా ప్రజలు కష్టాల్లో ఉంటే ఆదుకునే పార్టీ టీడీపీ అని అన్నారు. ఎన్నికల ప్రచారాని రెండు రోజుల సమయం మాత్రమే మిగిలి ఉందని, కార్యకర్తలంతా కష్టపడి పనిచేసి ప్రజాకూటమి అభ్యర్థుల విజయానికి కృషి చేయాలని కోరారు.