రేవంత్ రెడ్డి విడుదల

రేవంత్ రెడ్డి విడుదల

04-12-2018

రేవంత్ రెడ్డి విడుదల

కాంగ్రెస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ రేవంత్‌ రెడ్డిని పోలీసులు విడుదల చేశారు. భారీ భద్రత మధ్య ఆయన్ను జడ్చర్ల పోలీస్‌ ట్రైనింగ్‌ సెంటర్‌ నుంచి కొండగల్‌కు తరలించారు. ఉదయం నాలుగు గంటల సమయంలో ఇక్కడికి తీసుకొచ్చిన పోలీసులు సుమారు 12 గంటలపాటు నిర్భందించారు. రాష్ట్ర ఎన్నికల అధికారి రజత్‌ కుమార్‌ ఆదేశాల మేరకు రేవంత్‌ను పోలీసులు విడుదల చేశారు. రేవంత్‌ స్టార్‌ క్యాంపెయినర్‌ అని, అయన ఎక్కడైనా ప్రచారం చేసుకోవచ్చని, ఆయన్ను వెంటనే విడుదల చేయాలంటూ డీజీపీ మహేందర్‌ రెడ్డిని రజత్‌ కుమార్‌ ఆదేశించారు.