విజయసంకల్ప పైలాన్ ను ఆవిష్కరించిన వైఎస్ జగన్

విజయసంకల్ప పైలాన్ ను ఆవిష్కరించిన వైఎస్ జగన్

09-01-2019

విజయసంకల్ప పైలాన్ ను ఆవిష్కరించిన వైఎస్ జగన్

వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ అధ్యక్షుడు, ప్రతిపక్ష నేత వైఎస్‌ జగన్‌మోహన్‌ రెడ్డి ప్రజాసంకల్ప యాత్ర ముగిసింది. పాదయాత్ర ముగింపు సందర్భంగా ఇచ్ఛాపురంలో పైలాన్‌ను ఆయన ఆవిష్కరించారు. నవంబర్‌ 6, 2017న ఇడుపులపాయలో యాత్ర ప్రారంభమైంది. 341 రోజులు, 3,648 కిలోమీటర్లు పాదయాత్ర చేశారు. 134 నియోజకవర్గాలు, 2,516 గ్రామాల్లో జగన్‌ యాత్ర సాగింది. 124 బహిరంగ సభలు, 55 ఆత్మీయ సదస్సులో పాల్గొన్నారు. తూర్పుగోదావరి జిల్లాలో అత్యధికంగా 412 కి.మీ సాగింది. జగన్‌ రాకముందే ప్రధాన సభా ప్రాంగణం మొత్తం నిండిపోయింది. పైలాన్‌ నుంచి 2 కిలోమీటర్ల మేర జనంతో రోడ్లన్నీ జనంతో నిండిపోయాయి.