హైదరాబాద్-ఢిల్లీ మధ్య ఎయిర్ ఏషియా సేవలు

హైదరాబాద్-ఢిల్లీ మధ్య ఎయిర్ ఏషియా సేవలు

11-01-2019

హైదరాబాద్-ఢిల్లీ మధ్య ఎయిర్ ఏషియా సేవలు

హైదరాబాద్‌, ఢిల్లీ మధ్య ఎయిర్‌ ఏషియా ఇండియా విమాన సేవలను ప్రారంభించింది. విమానం ఢిల్లీలో ఉదయం 6:05 గంటలకు బయలుదేరి 8:15 గంటలకు హైదరాబాద్‌ చేరుతుంది. హైదరాబాద్‌లో 8:45 గంటలకు బయలుదేరి ఢిల్లీకి 11 గంటలకు చేరుతుందని ఎయిర్‌ఏషియా తెలిపింది. అలాగే మరో ఫ్లైట్‌ సాయంత్రం ఢిల్లీలో 17:50 గంటలకు బయలుదేరి హైదరాబాద్‌కు 20:00 గంటలకు చేరుతుంది. తిరుగు ప్రయాణంలో హైదరాబాద్‌లో 20:25 గంటలకు బయలుదేరి ఢిల్లీకి 22:25 గంటలకు చేరుతుంది. ఢిల్లీ, హైదరాబాద్‌ల మధ్య సేవలను ప్రారంభించడంతోపాటు ఢిల్లీ నుంచి శ్రీనగర్‌, పుణేలకు అదనపు ప్లైట్లను ప్రారంభిస్తున్నట్లు ఎయిర్‌ఏషియా ఇండియా ఎండీ, సీఈవో సునీల్‌ భాస్కరన్‌ తెలిపారు. కొత్త సేవలకు సంబంధించి ఫిబ్రవరి 1 నుంచి ప్లైట్లు అందుబాటులో ఉంటాయన్నారు. ఇటీవలే చెన్నై, హైదరాబాద్‌ మధ్య ఎయిర్‌ఏషియా ఫ్లైట్లను ప్రారంభించింది.