శ్రీవారి సేవలో వైఎస్ జగన్

శ్రీవారి సేవలో వైఎస్ జగన్

11-01-2019

శ్రీవారి సేవలో వైఎస్ జగన్

ఆంధ్రప్రదేశ్‌ ప్రతిపక్ష నేత వైఎస్‌ జగన్మోహనరెడ్డి తిరుమల శ్రీవేంకటేశ్వర స్వామి వారికి మొక్కు చెల్లించుకున్నారు. ప్రజాసంకల్ప యాత్ర పూర్తి చేసుకున్న అనంతరం ఆయన విజయనగరం నుంచి రైలులో బయలుదేరి రేణిగుంట రైల్వేస్టేషన్‌కు చేరుకున్నారు. అక్కడి నుంచి తిరుపతిలోని పద్మావతి అతిథి గృహానికి చేరుకున్నారు. అనుమతించిన అతి కొద్ది మంది పార్టీ నేతలను కలుసుకున్నారు. మధ్యాహ్నం 1:10 గంటలకు అలిపిరి నుంచి నడక ప్రారంభించి ఆలయాలను సందర్శిస్తూ.. అక్కడక్కడా సేద తీరుతూ సాయంత్రం 5:30కు తిరుమలకు చేరుకున్నారు. ఆయన వెంట మిథున్‌ రెడ్డి, రోజా, కరుణాకరరెడ్డి తదితరులు నడిచారు. దివ్యదర్శనం టోకెన్‌ తీసుకున్న జగన్‌ కోసం భక్తులను కొద్దిసేపు ఆపి ప్రత్యేక దర్శనాన్ని తిరుమల తిరుపతి దేవస్థానం కల్పించింది. శ్రీవారిని దర్శించుకున్న అనంతరం ఆయన హుండీలో కానుకలు సమర్పించారు. ఆలయం నుంచి బయటకు వచ్చిన జగన్‌ శ్రీశారదపీఠానికి చేరుకుని పీఠాధిపతి స్వరూపానందేంద్ర సరస్వతిస్వామిని కలిసి ఆశీస్సులు అందుకున్నారు.