వారికి రాబోయే రోజుల్లో....ఏపీలో పూర్తి సినిమా చూపిస్తాం

వారికి రాబోయే రోజుల్లో....ఏపీలో పూర్తి సినిమా చూపిస్తాం

11-01-2019

వారికి రాబోయే రోజుల్లో....ఏపీలో పూర్తి సినిమా చూపిస్తాం

ప్రధానమంత్రి నరేంద్ర మోదీపై ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర పంచాయతీరాజ్‌ శాఖ మంత్రి నారా లోకేష్‌ విరుచుకుపడ్డారు. మోదీ మోనార్క్‌లా వ్యవహరిస్తున్నారని ఆరోపించారు. సీబీఐ, ఆర్బీఐలాంటి వ్వవస్థలను మోదీ భ్రష్టు పట్టించారని ధ్వజమెత్తారు. రాష్ట్ర అభివృద్ధికి ముఖ్యమంత్రి చంద్రబాబు అహర్నిశలు శ్రమిస్తున్నారని అన్నారు. ఏపీ బీజేపీ నేతలకు దమ్ముంటే రాష్ట్ర సమస్యలపై మోదీని నిలదీయాలని సవాల్‌ విసిరారు. మోదీ, ప్రతిపక్ష నేత జగన్‌ రాష్ట్ర అభివృద్ధిని అడ్డుకుంటున్నారని, ప్రత్యేక హోదాపై జగన్‌ ఏనాడైనా మోదీని నిలదీశారా అని ప్రశ్నించారు. ప్రజాసంకల్ప యాత్ర ముగింపు సభలో మోదీపై ఒక్క విమర్శ చేయలేదని, జగన్‌పై ఉన్న కేసులను నీరుగార్చేందుకు ప్రయత్నాలు చేస్తున్నారని విమర్శించారు. మొన్న కర్ణాటకలో బీజేపీ చూసింది ట్రైలర్‌ మాత్రమేనని, రాబోయే రోజుల్లో ఏపీలో పూర్తి సినిమా చూపిస్తామని లోకేష్‌ హెచ్చరించారు.