నారావారిపల్లెకు నారా, నందమూరి కుటుంబాలు

నారావారిపల్లెకు నారా, నందమూరి కుటుంబాలు

12-01-2019

నారావారిపల్లెకు నారా, నందమూరి కుటుంబాలు

ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు స్వగ్రామమైన చిత్తూరు జిల్లా చంద్రగిరి మండలం నారావారిపల్లెకు సంక్రాంతి కళ వచ్చేసింది. నారా, నందమూరి కుటుంబ సభ్యులు నేడు నారావారి పల్లెకు చేరుకోనున్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబు ఏటా సంక్రాంతి పండుగను కుటుంబ సమేతంగా స్వగ్రామంలో జరుపుకొంటున్నారు. నేడు మధ్యాహ్నం ముఖ్యమంత్రి సతీమణి భువనేశ్వరి, కుమారుడు లోకేశ్‌, కోడలు బ్రహ్మణి మనవడు దేవాన్ష్‌ నారావారి పల్లెకు రానున్నారు. చంద్రబాబు మాత్రం 14వ తేదీన అక్కడకు చేరుకొంటారు చంద్రబాబు వియ్యంకుడు, నటుడు నందమూరి బాలకృష్ణ కుటుంబ సభ్యులు నేడే నారావారి పల్లెకు చేరుకోనున్నారు.