కాంగ్రెస్ అధికారంలోకి రాగానే ఆంధ్రప్రదేశ్ కు హోదా ఇస్తాం

కాంగ్రెస్ అధికారంలోకి రాగానే ఆంధ్రప్రదేశ్ కు హోదా ఇస్తాం

12-01-2019

కాంగ్రెస్ అధికారంలోకి రాగానే ఆంధ్రప్రదేశ్ కు హోదా ఇస్తాం

ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేక హోదా విషయంలో తమది ఒకటే మాట అని కాంగ్రెస్‌ అధ్యక్షుడు రాహుల్‌ గాంధీ మరోసారి సృష్టం చేశారు. వచ్చే ఎన్నికల్లో తమ పార్టీ అధికారంలోకి వస్తే ఏమాత్రం ఆలస్యం చేయకుండా ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేకహోదా ఇస్తామని ప్రకటించారు. ఈ మేరకు రెండురోజుల పర్యటన నిమిత్తం యూఏఈ వచ్చిన రాహుల్‌  దుబాయ్‌లోని భారతీయ కార్మికులను ఉద్దేశించి మాట్లాడారు. ఆంధ్రప్రదేశ్‌ ప్రత్యేక హోదా కోసం గత ఏడాది మార్చిలో ఢిల్లీలోని జంతర్‌ మంతర్‌ వద్ద ఆందోళన చేస్తున్న వారితో తాను స్వయంగా మాట్లాడినట్లు రాహుల్‌ వెల్లడించారు. ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేక హోదా ఇస్తాం. 2019 ఎన్నికల్లో అధికారంలోకి రాగానే చేసే మొట్టమొదటి పని అదే అని ఆనాడు తాను హామీ ఇచ్చినట్లు తెలిపారు.