అమరావతి ఐకానిక్ వంతెనకు సీఎం చంద్రబాబు శంకుస్థాపన

అమరావతి ఐకానిక్ వంతెనకు సీఎం చంద్రబాబు శంకుస్థాపన

12-01-2019

అమరావతి ఐకానిక్ వంతెనకు సీఎం చంద్రబాబు శంకుస్థాపన

నవ్యాంధ్ర రాజధాని అమరావతికి సంబంధించి రెండు కీలకమైన ప్రాజెక్టులకు ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు శంకుస్థాపన చేశారు. విజయవాడ-హైదరాబాద్‌ జాతీయ రహదారిని రాజధానితో అనుసంధానిస్తూ కృష్ణా నదిపై నిర్మించే ఐకానిక్‌ వంతెనకు చంద్రబాబు ఇబ్రహీంపట్నం సమీపంలోని పవిత్రసంగమం వద్ద శంకుస్థాపన చేశారు. తాగునీటి అవసరాలకు చేపడుతున్న నీటిశుద్ధి ప్లాంట్‌కు కూడా భూమి పూజా చేశారు.

ఇబ్రహీంపట్నం సమీపంలోని పవిత్రసంగం నుంచి అమరావతి వరకు కృష్ణానదిపై రూ.1387 కోట్లతో 3.2కి.మీ.ల పొడవైన ఐకానిక్‌ వంతెను నిర్మించనున్నారు. దీని మధ్యలో 0.48. కి.మీల భాగాన్ని ఐకానిక్‌గా నిర్మిస్తారు. ఈ భాగంలో యోగ భంగిమను పోలిన విధంగా పైలాన్‌ ఉంటుంది. దీనిని వంతెనతో అనుసంధానిస్తూ రెండు పక్కలా తీగల అమరిక ఉంటుంది. ఈ పైలాన్‌ ఎత్తు 170 మీటర్లు. ఆరు వరుసలుగా నిర్మిస్తారు. రెండు పక్కలా 2.5 మీటర్ల వెడల్పైన నడకదారి ఉంటుంది. నిర్మాణానికి పైల్‌ ఫౌండేసన్‌ వేస్తారు. ఈ వంతెనతో హైదరాబాద్‌ జగదల్‌పూర్‌ జాతీయ రహదారులు అమరావతిలో అనుసంధానమవుతాయి. రాజధాని తాగునీటి అవసరాలకు రూ.745.65 కోట్లతో నిర్మించే వ్యవస్థలో భాగంగా మంతెన సత్యనారాయణరాజు ప్రకృతి ఆశ్రమం వద్ద 13 మీటర్ల చుట్టు కొలత కలిగి రెండు ఇన్‌టేక్‌ బావులు నిర్మిస్తారు.

Click here for Photogallery