శాసనమండలి ఎన్నికలో ఓటేసిన సీఎం చంద్రబాబు

శాసనమండలి ఎన్నికలో ఓటేసిన సీఎం చంద్రబాబు

22-03-2019

శాసనమండలి ఎన్నికలో ఓటేసిన సీఎం చంద్రబాబు

ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఓటు వేశారు. తాడేపల్లి మండల పరిషత్‌ ఎలిమెంటరీ పాఠశాలలో ఎమ్మెల్సీ ఎన్నికకు చంద్రబాబు ఓటు హక్కు వినియోగించుకున్నారు. తెలుగు రాష్ట్రాల్లో కోలాహలంగా ఎమ్మెల్సీ ఎన్నికలు జరుగుతున్నాయి. ఆంధ్రప్రదేశ్‌లో ఒక టీచర్‌, రెండు గ్రాడ్యుయేట్‌ ఎమ్మెల్సీ స్థానాలకు ఎన్నికలు జరుగుతుండగా, తెలంగాణ రెండు టీచర్‌, ఒక గ్రాడ్యుయేట్‌ ఎమ్మెల్సీ స్థానానికి ఎన్నికలు జరుగుతున్నాయి.