నేరాల్లో అనుభవమే తప్ప.. పరిపాలనలో ఆయనకు లేదు

నేరాల్లో అనుభవమే తప్ప.. పరిపాలనలో ఆయనకు లేదు

22-03-2019

నేరాల్లో అనుభవమే తప్ప.. పరిపాలనలో ఆయనకు లేదు

నేరాలకు వైఎస్‌ జగన్‌ బ్రాండ్‌ అంబాసిడర్‌ అని తెలుగుదేశం పార్టీ అధినేత, ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అన్నారు. పార్టీ నేతలతో చంద్రబాబు టెలికాన్ఫరెన్స్‌ నిర్వహించారు. రాజకీయ వైరాలు మరిచి ఐక్యంగా పనిచేయాలని దిశానిర్దేశం చేశారు. కుట్రలు చేసి టీడీపీ డేటా, కార్యకర్తల సమచారం చోరీ చేశారని, తమవాళ్లకే ఫోన్లు చేసి బెదిరిస్తూ వేధిస్తున్నారని చంద్రబాబు ఆరోపించారు.

వైకాపా నేతల ప్రలోభావాలను అధిగమించాలని, వేధింపులను ఎదుర్కోవాలని నేతలకు సూచించారు. బీజేపీ, టీఆర్‌ఎస్‌, వైకాపా కుట్రలను చిత్తు చేయాలన్నారు. ఫ్రస్టేషన్‌తో బీజేపీ, ఫ్యాక్షన్‌ ధోరణితో వైకాపా తప్పుమీద తప్పులు చేస్తున్నాయని ఆరోపించారు. నేరాలు-ఘోరాలకు బ్రాండ్‌ అంబాసిడర్‌ జగన్‌ అయితే, అభివృద్ధి సంక్షేమానికి బ్రాండ్‌ అంబాసిడర్‌ తెలుగుదేశమని అన్నారు. వాళ్ల చిన్నాన్న హత్య కేసు ఆరోపణలు వళ్ల అనుచరులపైనా వస్తున్నాయన్నారు. నేరస్థులకు తప్పించుకునే అలవాటు ఎక్కువ ఉంటుందని, సాక్ష్యాలను తారుమారు చేయడం నేరస్థులకే అలవాటన్నారు. బాబాయిని చంపేస్తే దాచిపెట్టే వ్యక్తిని, పార్టీని ఏమనాలని ప్రశ్నించారు. నేరాల్లో అనుభవమే తప్ప పరిపాలనలో అనుభవం జగన్‌కు లేదని ఎద్దేవాచేశారు.