చంద్రబాబే మళ్లీ ముఖ్యమంత్రి కావాలి: ప్రత్తిపాటి

చంద్రబాబే మళ్లీ ముఖ్యమంత్రి కావాలి: ప్రత్తిపాటి

22-03-2019

చంద్రబాబే మళ్లీ ముఖ్యమంత్రి కావాలి: ప్రత్తిపాటి

చంద్రబాబే మళ్లీ ముఖ్యమంత్రి కావాలని ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర ప్రజలు కోరుకుంటున్నారని మంత్రి ప్రత్తిపాటి పుల్లారావు అన్నారు. గుంటూరు జిల్లా, చిలకలూరిపేట అభ్యర్థిగా ఆయన నామినేషన్‌ దాఖలు చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నియోజకవర్గంలో రూ.4వేల కోట్ల విలువైన అభివృద్ధిపనులు చేపట్టామని, ప్రజలు తమను ఆశీర్వదించడానికి సిద్ధంగా ఉన్నారని అన్నారు. కేసీఆర్‌తో కలిసిన జగన్‌కు ఓటు వేస్తే ఏపీలో కేసీఆర్‌ పాలిస్తారనే భావన ప్రజల్లో ఉందని అన్నారు. ప్రధాని మోదీ విభజన హామీలు అమలు చేయకుండా రాష్ట్రానికి అన్యాయం చేశారని విమర్శించారు. ఈ ముగ్గురిపై ధర్మపోరాటం చేస్తున్న చంద్రబాబుకు మనం అండగా ఉంటే, రాష్ట్రం ప్రశాంతంగా ఉంటుందని అన్నారు.