6న శ్రీవారి ఆలయంలో ఉగాది ఆస్థానం

6న శ్రీవారి ఆలయంలో ఉగాది ఆస్థానం

23-03-2019

6న శ్రీవారి ఆలయంలో ఉగాది ఆస్థానం

తిరుమల శ్రీవేంకటేశ్వర స్వామివారి ఆలయంలో శ్రీవికారినామ సంవత్సర ఉగాది ఆస్థానాన్ని ఏప్రిల్‌ 6న తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) ఘనంగా నిర్వహించనుంది. వేకువజామున 3 గంటలకు సుప్రభాత సేవ అనంతరం ఆలయాన్ని శుద్ధి చేయనున్నారు. ఉదయం 7 నుంచి 9 గంటల మధ్య జీయంగార్‌ స్వాములు నూతన పట్టువస్త్రాలతో విమాన ప్రాకారం, ధ్వజస్తంభం చుట్టూ ఊరేగింపుగా వచ్చి గర్భాలయంలోని శ్రీవారి మూలవిరాట్టుకు, ఉత్సవమూర్తులకు ధరింపజేస్తారు. అనంతరం పంచాంగ శ్రవణం ఉంటుంది. ఉగాది ఆస్థానానికి బంగారు వాకిలి ఎదుట ఆగమ పండితులు, అర్చకులు శాస్త్రోక్తంగా నిర్వహించనున్నారు. ఈ నేపథ్యంలో శ్రీవారికి కల్యాణోత్సవం ఊంజలసేవ, ఆర్జిత బ్రహ్మూెత్సవం, వసంతోత్సవాలను టీటీడీ రద్దు చేసింది.