టీడీపీలోకి సీకేబాబు!

టీడీపీలోకి సీకేబాబు!

23-03-2019

టీడీపీలోకి సీకేబాబు!

చిత్తూరు మాజీ ఎమ్మెల్యే సీకే జయచంద్రారెడ్డి (సీకే బాబు) తెలుగుదేశం పార్టీ అధినేత, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మర్వాద పూర్వకంగా కలిశారు. ఉండవల్లిలోని సీఎం నివాసంలో ఆయన్ను కలిసి తెలుగుదేశం పార్టీలో చేరేందుకు సిద్దంగా ఉన్నట్లు తన నిర్ణయాన్ని వెల్లడించారు. రెండు రోజుల్లో చంద్రబాబు చిత్తూరు జిల్లాలో పర్యటించనున్నారు. ఈ సందర్భంగా తన అనుచరులతో కలిసి టీడీపీలో చేరుతానని ఆయన చెప్పారు. అందుకు చంద్రబాబు అంగీకరించారు. ముఖ్యమంత్రి కలిసిన వారిలో సీకేబాబు సతీమణి లావణ్య, మున్సిపల్‌ మాజీ చైర్మన్‌ సరళామేరీ, కార్పొరేటర్‌ రమణ తదితరులు పాల్గొన్నారు.