ఇండిగో సమ్మర్ సేల్ ఆఫర్

ఇండిగో సమ్మర్ సేల్ ఆఫర్

15-05-2019

ఇండిగో సమ్మర్ సేల్ ఆఫర్

వేసవి దృష్టిలో పెట్టుకుని విమానయాన సంస్థ ఇండిగో ప్రత్యేక ఆఫర్‌ను ప్రకటించింది. దేశీయ మార్గాల్లో ప్రయాణానికి రూ.999 నుంచి, అంతర్జాతీయ మార్గాల్లో ప్రయాణానికి రూ.3499 నుంచి టికెట్లు విక్రయిస్తున్నామని ఇండిగో ప్రకటించింది. మంగళవారం (ఈనెల 13) ప్రారంభమైన అమ్మకాలు గురువారం (16వ తేదీ) వరకు కొనసాగుతాయని, ఈ నెల 29 నుంచి సెప్టెంబరు 28 మధ్య ప్రయాణానికి వీటిని వినియోగించుకోవచ్చని తెలిపింది. దేశంలోని 53 గమ్యస్థానాలకు, అంతర్జాతీయంగా 17 మార్గాల్లో ఈ ఆఫర్‌ వర్తిస్తుందని వెల్లడించింది. మొత్తం 10 లక్షల సీట్లు ఆఫర్‌ కింద అందుబాటులో ఉన్నాయని తెలిపింది.