వైభవంగా పద్మావతి పరియణయోత్సవం

వైభవంగా పద్మావతి పరియణయోత్సవం

15-05-2019

వైభవంగా పద్మావతి పరియణయోత్సవం

తిరుమలలో జరుగుతున్న శ్రీపద్మావతి పరిణయోత్సవాల్లో భాగంగా వైశాఖశుద్ధ దశమి మంగళవారం శ్రీనివాసుడు పెళ్లి కుమారుడిగా ముస్తాబై అశ్వవాహనం మీద పరిణయ వేదికకు చేరుకున్న ఘట్టం కనులవిందుగా జరిగింది. సాయంత్రం శ్రీమలయప్పస్వామి అశ్వవాహనంపై బయలుదేరి, స్వర్ణ పల్లకిలో శ్రీదేవి, భూదేవి అనుసరించగా నారాయణగిరి ఉద్వానవనం చేరుకున్నారు. మొదటిరోజు తరహాలోనే శ్రీవారికి అమ్మవార్లు ఎదురుకోలు, పూలబంతులాట, నూతనవస్త్ర ధారణ తదితర కార్యక్రమాలను శాస్త్రోకంగా పూర్తి చేశారు. ఆ తర్వాత కొలువు నిర్వహించారు. ఆ తర్వాత శ్రీవారు తన దేవేరులతో పల్లకినెక్కి తిరువీధుల్లో ఊరేగుతూ ఆలయ ప్రవేశం చేశారు.