మళయాళ మాసం ఇడవం ప్రారంభమైన సందర్భంగా శబరిమల అయ్యప్ప ఆలయాన్ని తెరిచారు. ఈ సందర్భంగా ట్రావెన్కోర్ దేవస్థానం బోర్డు అధ్యక్షుడు ఎ.పద్మకుమార్, బోర్డు సభ్యుల సమక్షంలో ప్రధాన పూజారి వి.ఎన్.వాసుదేవన్ సంప్రదాయ పూజలు నిర్వహించారు. అయ్యప్ప దర్శనానికి భక్తులు పెద్దసంఖ్యలో తరలిరావడంతో ఆలయ పరిసరాలు కిటకిటలాడాయి. ఐదు రోజుల పూజల అనంతరం ఈ నెల 19వ తేదీ సాయంత్రం ఆలయాన్ని మూసివేయనున్నారు.