త్వరలో రూ.10 కొత్త నోటు

త్వరలో రూ.10 కొత్త నోటు

21-05-2019

త్వరలో రూ.10 కొత్త నోటు

మహాత్మా గాంధీ(కొత్త) సిరీస్‌లో రూ.10 డినామినేషన్‌తో కొత్త నోటును జారీ చేయనున్నట్లు భారతీయ రిజర్వ్‌ బ్యాంక్‌ (ఆర్‌బీఐ) ప్రకటించింది. ఆర్‌బీఐ గవర్నర్‌ శక్తికాంత్‌ దాస్‌ సంతకంతో రూ.10 నోటును తీసుకురానున్నట్లు తెలిపింది. త్వరలో ఈ కొత్త నోట్లను జారీ చేయనున్నట్లు ఆర్‌బీఐ వెల్లడించింది. మహాత్మాగాంధీ (కొత్త) సిరీస్‌లో అన్ని ఇతర నోట్లు ఉన్న తరహాలోనే రూ.10 కొత్త నోటును డిజైన్‌ చేసినట్లు ఆర్‌బీఐ పేర్కొంది. కొత్తగా జారీ చేయనున్న రూ.10 నోటుతోపాటు గతంలో జారీ చేసిన నోట్లన్నీ చెల్లుబాటవుతాయని తెలిపింది.