చంద్రబాబే మళ్లీ సీఎం

చంద్రబాబే మళ్లీ సీఎం

21-05-2019

చంద్రబాబే మళ్లీ సీఎం

చంద్రబాబునాయుడే మళ్లీ ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేస్తారని పర్యాటక శాఖ మంత్రి అఖిల ప్రియ ధీమా వ్యక్తం చేశారు. కడప నగరంలోని పెద్దదర్గాను దర్శించుకున్నారు. అనంతరం మంత్రి అఖిలప్రియ మీడియాతో మాట్లాడుతూ సీఎంగా ప్రవేశపెట్టిన సంక్షేమ, అభివృద్ధి పథకాలే చంద్రబాబును మళ్లీ ముఖ్యమంత్రిని చేస్తున్నాయి. లోటు బడ్జెట్‌లో ఉన్నప్పటికీ చేపట్టిన సంక్షేమ పథకాలు, అభివృద్ధి పనులను చూపించి మంత్రులు, ఎమ్మెల్యేలు, నేతలు గ్రామాల్లో తలెత్తుకొని తిరిగి ఓట్లు అడిగాం. మహిళలు, వృద్ధులు ఇలా అన్ని రంగాల వారు టీడీపీకి పట్టం కట్టారు. భారీ మెజార్టీతో టీడీపీ విజయం సాధిస్తుంది అని అన్నారు.