హరితహారానికి మేం సిద్ధం : క్యాథరిన్ హడ్డా

హరితహారానికి మేం సిద్ధం : క్యాథరిన్ హడ్డా

21-05-2019

హరితహారానికి మేం సిద్ధం : క్యాథరిన్ హడ్డా

త్వరలో ప్రారంభంకానున్న ఐదో విడుత తెలంగాణకు హరితహారం కార్యక్రమంలో తమ వంతు పాత్ర పోషిస్తామని హైదరాబాద్‌లోని అమెరికా కాన్సుల్‌ జనరల్‌ క్యాథరిన్‌ హడ్డా చెప్పారు. గచ్చిబౌలిలో నిర్మిస్తున్న యూఎస్‌ కాన్సులేట్‌ కార్యాలయం ఆవరణలో పెద్దమొత్తంలో మొక్కలు నాటి పచ్చదనాన్ని తీసువస్తామన్నారు. ఇందుకోసం ఇప్పటినుంచే ప్రత్యేక నర్సరీ ఏర్పాటు చేసి మొక్కలు సిద్ధం చేస్తున్నట్టు క్యాథరిన్‌ హడ్డా ట్విట్టర్‌లో పేర్కొన్నారు. పర్యావరణ పరిరక్షణకు హరితహారం మంచి కార్యక్రమమని చెప్పారు.