అక్కడ రాహుల్...ఇక్కడ చంద్రబాబు

అక్కడ రాహుల్...ఇక్కడ చంద్రబాబు

21-05-2019

అక్కడ రాహుల్...ఇక్కడ చంద్రబాబు

ఇటీవల జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో (2019) కాంగ్రెస్‌ పార్టీ ప్రధానంగా ఉండే కూటమి కేంద్రంలో రెండు వందల నుంచి 230 స్థానాలు గెలుచుకునే అవకాశం ఉందని దేవాదాయ శాఖ ఆస్థాన జ్యోతిష్యులు పూజ్యం విశ్వనాధ్‌ జోస్యం చెప్పారు. వివిధ లెక్కల ప్రకారం కాంగ్రెస్‌ కూటమికే అధికారం దక్కనుందని ఆయన చెప్పారు. ప్రస్తుతం అధికారంలో ఉన్న మోడీ నేతృత్వంలోని ఎన్డీయే కూటమికి 150 నుంచి 180 లోక్‌సభ స్థానాలు దక్కే అవకాశం ఉందని ఆయన పేర్కొన్నారు. ఎట్టి పరిస్థితుల్లోనూ తిరిగి నరేంద్ర మోదీ ప్రధాని అయ్యే అవకాశాలు లేవన్నారు. రానున్న రోజుల్లో ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి చంద్రబాబు దేశ రాజకీయాల్లో కీలక పాత్ర పోషించనున్నారని ముఖ్యంగా కేంద్రంలో ప్రభుత్వ ఏర్పాటు విషయంలో రాహుల్‌గాంధీ ప్రధాని పీఠాన్ని అధిష్టించేందుకు చంద్రబాబు రచిస్తున్న ప్రణాళిక సత్ఫలితాలను ఇవ్వబోతొందని విశ్వనాధ్‌ వివరించారు. రాహుల్‌గాంధీ ప్రధాని అయ్యే అవకాశం ఉందని తెలియచేశారు.