ఉప రాష్ట్రపతిని ఆకర్షించిన కరీంనగర్‌ పథకం

ఉప రాష్ట్రపతిని ఆకర్షించిన కరీంనగర్‌ పథకం

21-05-2019

ఉప రాష్ట్రపతిని ఆకర్షించిన కరీంనగర్‌ పథకం

తెలంగాణ రాష్ట్రంలోని కరీంనగర్‌ నగరంలో నూతనంగా ప్రవేశపెట్టనున్న పథకం ఉప రాష్ట్రపతి వెంకయ్య నాయుడును ఆకర్షించింది. కరీంనగర్‌ నగరపాలక సంస్థ మేయర్‌ రవీందర్‌సింగ్‌ పేద, మధ్య తరగతి ప్రజలకు భారం కలగకుండా నగర పాలక ద్వారా రూపాయికే అంత్యక్రియలు నిర్వహించేందుకు నిర్ణయించారు. ఇందుకు నిధులు కేటాయించడంతోపాటు ప్రత్యేక విభాగాన్ని ఏర్పాటు చేసి నిరుపేదలకు అండగా ఉంటామని ప్రశంసించారు. అంతిమ యాత్ర ఆఖరి సఫర్‌ అనే పథకం వివరాలను తెలుసుకున్న ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు ట్విటర్‌ ద్వారా స్పందించారు. కులమతాలు, పేద ధనిక బేధభావం లేకుండా అంతిమసంస్కారాల కోసం ప్రత్యేక పథకాన్ని రూపొందించిన కరీంనగర్‌ కార్పొరేషన్‌, మేయర్‌ రవీందర్‌సింగ్‌కు అభినందనలు తెలిపారు.