ఎగ్జాక్ట్‌ ఫలితాలతో సంబరాలు చేసుకుంటాం : దేవినేని

ఎగ్జాక్ట్‌ ఫలితాలతో సంబరాలు చేసుకుంటాం : దేవినేని

21-05-2019

ఎగ్జాక్ట్‌ ఫలితాలతో సంబరాలు చేసుకుంటాం : దేవినేని

ఈనెల 23న వెలువడే ఫలితాలతో తాము ఆంధ్రాలో సంబరాలు చేసుకుంటామని ఏపీ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు అన్నారు. విజయవాడలో ఆయన మీడియా సమావేశంలో మాట్లాడుతూ ఎగ్జిట్‌ పోల్స్‌ చూసుకుని తెలంగాణలో జగన్మోహన్‌ రెడ్డి సంబరపడుతున్నారని ఎద్దేవా చేశారు. రాజధాని అమరావతిని భ్రమరావతి అన్న జగన్‌ ఎలా గెలుస్తారని ఆయన ప్రశ్నించారు. జగన్‌కు ఏం చూసి ప్రజలు ఓటేస్తారని అన్నారు. 2014లో రాష్ట్రం ఏమైపోతుందో అనే భయంతో ప్రజలు టీడీపీకి ఓటేసి గెలిపించారని, చంద్రబాబు అయితేనే రాష్ట్రం అభివృద్ది చెందుతుందనే భావంతోనే ఆయనను సీఎం చేశారని అన్నారు. 2019లో కూడా టీడీపీని గెలిపిస్తేనే రాష్ట్ర భవిష్యత్తు అనే బాధ్యతతో ప్రజలు ఓటశారని తెలిపారు. రాష్ట్రంలో 62 ప్రాజెక్టులు పనులు కొనసాగుతున్నాయని తెలిపారు. అవినీతిపరులు, అరాచకశక్తులు రాజ్యాధికారాన్ని ఆశిస్తున్నారని విమర్శించారు. ప్రజల ఆమోదంతో తెలుగుదేశం పార్టీ 130 సీట్లు గెలుస్తుందని ధీమా వ్యక్తం చేశారు. ఎగ్జిట్‌ పోల్స్‌ తమకు అనుకూలంగా వచ్చాయన్న మోదీ, అమిత్‌ షాకు కనువిప్పు కలుగుతుందని అన్నారు.