అసెంబ్లీలో చంద్రబాబు... మండలిలో యనమల

అసెంబ్లీలో చంద్రబాబు... మండలిలో యనమల

12-06-2019

అసెంబ్లీలో చంద్రబాబు... మండలిలో యనమల

శాసనసభలో టీడీపీ పక్ష నేతగా ఆ పార్టీ జాతీయ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు, శాసన మండలిలో యనమల రామకృష్ణుడు వ్యవహరించనున్నారు. ఉండవల్లి ప్రజావేదికలో తెలుగుదేశం పార్టీ శాసనసభా పక్ష సమావేశం జరిగింది. అసెంబ్లీలో టీడీపీ ఉప నేతలుగా అచ్చెన్నాయుడు, గోరంట్ల బుచ్చయ్యచౌదరి, రామానాయుడు వ్యవహరిస్తారు. విప్‌గా వీరాంజనేయ స్వామిని ఎన్నుకున్నారు. మండలిలో టీడీపీ పక్ష నేతగా యనమల రామకృష్ణుడు, ఉపనేతలుగా డొక్కా మాణిక్య వరప్రసాద్‌, సంధ్యారాణి, జీ.శ్రీనివాసులు, విప్‌గా బుద్ధా వెంకన్న వ్యవహరిస్తారు. కోశాధికారిగా మద్దాలి గిరిని నియమిస్తూ చంద్రబాబు నిర్ణయం తీసుకున్నారు.