వైఎస్‌ జగన్‌కు సీఎం కేసీఆర్‌ ఆహ్వానం

వైఎస్‌ జగన్‌కు సీఎం కేసీఆర్‌ ఆహ్వానం

12-06-2019

వైఎస్‌ జగన్‌కు సీఎం కేసీఆర్‌ ఆహ్వానం

తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్మించిన కాళేశ్వరం ప్రాజెక్టును ఈనెల 21న ప్రారంభించాలని తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌ నిర్ణయించారు. ఈ ప్రాజెక్టు ప్రారంభోత్సవానికి ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి జగన్‌ మోహన్‌రెడ్డిని ముఖ్య అతిథిగా ఆహ్వానించాలని ముఖ్యమంత్రి నిర్ణయించినట్లు సమాచారం. త్వరలోనే ముఖ్యమంత్రి కేసీఆర్‌ స్వయంగా విజయవాడ వెళ్లి జగన్‌ను ఆహ్వానించనున్నారు. దాదాపు 151 టీఎంసీల గోదావరి జలాలను ఒడిసిపట్టేందుకు కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణం చేపట్టారు.