ఏపీ అసెంబ్లీ సమావేశాలు ప్రారంభం

ఏపీ అసెంబ్లీ సమావేశాలు ప్రారంభం

12-06-2019

ఏపీ అసెంబ్లీ సమావేశాలు ప్రారంభం

ఆంధ్రప్రదేశ్‌ 15వ శాసనసభ తొలి సమావేశాలు ప్రారంభమయ్యాయి. జాతీయ గీతంతో సమావేశాలు ప్రారంభమయ్యాయి. ప్రొటెం స్పీకర్‌గా శంబంగి చిన వెంకట అప్పలనాయుడు బాధ్యతలు స్వీకరించారు. ముఖ్యమంత్రి జగన్‌ మోహన్‌రెడ్డి, ప్రతిపక్ష నేత చంద్రబాబు నాయుడుతో పాటు ఎమ్మెల్యేలు హాజరయ్యారు. కడప జిల్లా పులివెందుల నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా ఎన్నికైన ముఖ్యమంత్రి జగన్‌ తొలుత ఎమ్మెల్యేగా ప్రమాణం చేశారు. ఆతర్వాత చిత్తూరు జిల్లా కుప్పం నియోజకవర్గం నుంచి ఎన్నికైన ప్రతిపక్షనేత చంద్రబాబు ఎమ్మెల్యేగా ప్రమాణం చేశారు. అనంతరం అక్షర క్రమంలో మిగిలిన ఎమ్మెల్యేలతో ప్రొటెం స్పీకర్‌ ప్రమాణం చేయించారు.

అసెంబ్లీ సమావేశాలు ప్రారంభం సందర్భంగా.. అసెంబ్లీ భవనం ప్రదాన ద్వారం, సీఎం వెళ్లే ద్వారాలకు పూలతో ప్రత్యేక అలంకరణ చేశారు. అసెంబ్లీలో ప్రతిపక్షానికి తాత్కాలిక ఛాంబర్లు కేటాయించారు. ప్రతిపక్ష నేత చంద్రబాబుకు టీడీఎల్పీకి పక్కపక్కనే గదులను కేటాయించారు.

Click here for Photogallery