25న కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి విందు

25న కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి విందు

19-06-2019

25న కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి విందు

ఆంధ్రప్రదేశ్‌, తెలంగాణ రాష్ట్రాలకు చెందిన ఎంపీలకు ఈ నెల 25న విందు ఇవ్వనున్నట్లు కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి కిషన్‌రెడ్డి తెలిపారు. ఈ సందర్భంగా ఉభయ రాష్ట్రాలకు సంబంధించిన సమస్యలను తెలుసుకోనున్నట్లు ఆయన తెలిపారు. కేంద్ర మంత్రులుగా ఉన్న వారు ఆయా రాష్ట్రాలకు చెందిన ఎంపీలతో సమన్వయం చేసుకోవాలని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ సూచించారని ఆయన తెలిపారు.