సీఎం సలహాదారుగా సజ్జల

సీఎం సలహాదారుగా సజ్జల

19-06-2019

సీఎం సలహాదారుగా సజ్జల

ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి జగన్‌ మోహన్‌ రెడ్డి సలహాదారు (ప్రజా వ్వవహారాలు)గా వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ సీనియర్‌ నాయకుడు, సీనియర్‌ జర్నలిస్టు సజ్జల రామకృష్ణారెడ్డిని ప్రభుత్వం నియమించింది. ఈ మేరకు ప్రభుత్వ ముఖ్య కార్యదర్శి ఆర్‌పి సిసోడియా ఉత్తర్వులు జారీ చేశారు. ఈ క్రమంలో సజ్జల రామకృష్ణారెడ్డి ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం కేబినేట్‌ హోదా కల్పించింది. ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌ మోహన్‌ రెడ్డికి అత్యంత సన్నిహితుడిగా ఉన్న సజ్జల రామకృష్ణారెడ్డి నియమాకం తక్షణం అమలులోకి రావాలని ప్రత్యేకంగా ఆదేశాలిచ్చారు. ఈ నియామకానికి సంబంధించిన నియమ నిబంధలను విడిగా విడుదల చేయనున్నట్టు ఆ ఉత్తర్వుల్లో పేర్కొన్నారు.