ప్రజావేదిక తర్వాత.. చంద్రబాబు నివాసమేనా?

ప్రజావేదిక తర్వాత.. చంద్రబాబు నివాసమేనా?

26-06-2019

ప్రజావేదిక తర్వాత.. చంద్రబాబు నివాసమేనా?

ప్రజావేదిక కూల్చితే ప్రక్రియ పూర్తికావస్తోంది. ఇదే సమయంలో ప్రజావేదిక పక్కన ఉన్న చంద్రబాబు నివాసంలో టీడీపీ నేతలు భేటీ అయ్యారు. అక్రమ కట్టడాలపై వెనక్కి తగ్గేది లేదని ప్రభుత్వం సృష్టం చేస్తోంది. చంద్రబాబు నివాసం ఉంటున్న నివాసం కూడా అక్రమ నిర్మాణమే. ఆయనే ఖాళీ చేస్తే గౌరవంగా ఉంటుందని మంత్రులు పేర్కొంటున్నారు. ప్రజావేదిక తర్వాత టార్గెట్‌ చంద్రబాబు నివాసమేనని పలువురు పేర్కొంటున్నారు. ప్రభుత్వ చర్యలపై టీడీపీ నేతల్లో చర్చ జరుగుతోంది. చంద్రబాబు నివాసం విషయంపై టీడీపీ నేతల సమాలోచనలు చేస్తున్నారు. ముందే ఖాళీ చేస్తే బాగుంటుందని కొందరు నేతలు అభిప్రాయపడుతుండగా, ప్రభుత్వం ఏం చేస్తుందో చుద్దామని మరికొందరు నేతలు పేర్కొంటున్నారు.