ఇంకా ఆ పేరుతో రాజకీయాలు చేయొద్దు

ఇంకా ఆ పేరుతో రాజకీయాలు చేయొద్దు

26-06-2019

ఇంకా ఆ పేరుతో రాజకీయాలు చేయొద్దు

కృష్ణా నది కరకట్ట వెంట ఉన్న అక్రమ నిర్మాణాలన్నీ కూల్చివేస్తామంటే తమకేమీ అభ్యంతరం లేదని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ అన్నారు. అలాకాకుండా ఒక్క ప్రజావేదిక మాత్రమే కూల్చాలనుకుంటే సరికాదన్నారు. ప్రజాధనంతో నిర్మించిన ఆ ప్రజావేదికను ప్రజల అవసరాలకే వినియోగించాలని సూచించారు. ప్రత్యేక హోదా ఇవ్వడం సాధ్యం కాదన్న ఆయన ఇంకా ఆ పేరుతో రాజకీయాలు చేయొద్దన్నారు. సాధ్యపడే విషయమైతే అంతకన్నా ఎక్కువ ప్యాకేజీ రూపంలో కేంద్రం ఎందుకిస్తుంది అని ప్రశ్నించారు. ఇప్పటికైనా రాజకీయ పార్టీలు ఇంకా ప్రజల్ని మోసం చేయకుండా కేంద్ర నుంచి నిధులు తీసుకొచ్చి రాష్ట్రాన్ని అభివృద్ధి చేసేందుకు ప్రయత్నం చేయాలన్నారు.