అధికారం ఎవరికీ శాశ్వతం కాదు : లోకేష్‌

అధికారం ఎవరికీ శాశ్వతం కాదు : లోకేష్‌

26-06-2019

అధికారం ఎవరికీ శాశ్వతం కాదు : లోకేష్‌

ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌పై మాజీ మంత్రి నారా లోకేష్‌ సంచలన కామెంట్స్‌ చేశారు. ఓవైపు నీతులు చెబుతూనే మరోవైపు అనుకున్నది చేసేస్తున్నారని ముఖ్యమంత్రి తీరును తూర్పారబట్టారు. ముఖ్యమంత్రి ఇంటికి అంతి సమీపంలోనే హత్య జరిగితే రాష్ట్రంలో లా అండ్‌ ఆర్డర్‌ కంట్రోల్‌లో ఉన్నట్లా? లేనట్లా? అని ప్రశ్నించారు. ఈ సందర్బంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ వైసీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత టీడీపీ కార్యకర్తలపై దాడులు పెరిగాయన్నారు. టీడీపీ నేతలు, కార్యకర్తలను హతమారుస్తున్నారని సంచలన ఆరోపణలు చేశారు. అధికారం ఎవరికీ శాశ్వతం కాదనేది జగన్‌ గుర్తించాలని చురకలంటించారు. గతంలో వైఎస్‌ఆర్‌ సీఎంగా ఉన్నప్పుడు కూడా టీడీపీ కార్యకర్తలను దారుణంగా హత్య చేయించారని గుర్తు చేశారు. ఇప్పుడు కూడా అవే పద్ధతులు పునరావృతం అవుతున్నాయని అన్నారు. తమ ఓపికను పరీక్షించొద్దని హెచ్చరించారు. హత్యా రాజకీయాలు శ్రేయస్కరం కాదన్నారు. శాంతిభద్రతల అంశాన్ని అధికారులు ఓ పార్టీ చేతుల్లో పెట్టడం సరైన పద్ధతి కాదన్నారు. హత్యా రాజకీయాలను ఖండిస్తూ డీజీపీని కలుస్తామని తెలిపారు.