రాష్ట్రాలుగా విడిపోయినా తెలుగువాళ్లం ఒకటే
Ramakrishna

రాష్ట్రాలుగా విడిపోయినా తెలుగువాళ్లం ఒకటే

18-05-2017

రాష్ట్రాలుగా విడిపోయినా తెలుగువాళ్లం ఒకటే

రాష్ట్రాలుగా విడిపోయినా తెలుగువాళ్లం ఒకటేనని కేంద్ర మంత్రి వెంకయ్య నాయుడు అన్నారు. ఈ  సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ పెండింగ్‌లో ఉన్న సమస్యల్ని చర్చల ద్వారా పరిష్కరించుకోవాలని రెండు తెలుగు రాష్ట్రాలకు సూచించారు. సామరస్య పూర్వక వాతావరణంలో ఉద్యోగుల విభజన, ఆస్తుల పంపిణీ చేసుకోవాలన్నారు. ఏకీకృత సర్వీసుల విషయంలో రెండు రాష్ట్రాల మంత్రులు, ఉపాధ్యాయ సంఘాల ప్రతినిధులతో తాను మాట్లాడానని త్వరలో సమస్య పరిష్కారమవుతుందని అన్నారు. ఇతర అంశాల్లోనూ అదే స్ఫూర్తి కొనసాగించాలని హితవు పలికారు.