గతంలో అభినందించడానికి వచ్చేవారు... ఇప్పుడు నిరసనలు

గతంలో అభినందించడానికి వచ్చేవారు... ఇప్పుడు నిరసనలు

11-07-2019

గతంలో అభినందించడానికి వచ్చేవారు... ఇప్పుడు నిరసనలు

గత తెలుగుదేశం ప్రభుత్వ హయాంలో చంద్రబాబు పాలనపై ప్రజలు అభినందించడానికి క్యాంప్‌ ఆఫీసుకు వచ్చేవారని, ఇప్పుడు సీఎం జగన్‌ క్యాంప్‌ కార్యాలయం దగ్గర నిరసనలు చేసేందుకు వస్తున్నారని టీడీపీ ఎమ్మెల్సీ బుద్దా వెంకన్న విమర్శించారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ జగన్‌ ఇంటి దగ్గర ఇప్పటి వరకు 80 నిరసన కార్యక్రమాలు జరిగాయని, సీఎం నివాసం దగ్గర 144 సెక్షన్‌ పెట్టి ప్రజలను రాకుండా చేసే పరిస్థితి నెలకొందని ఆరోపించారు. పెన్షన్లపై వైసీపీ ప్రభుత్వం అవాస్తవాలు ప్రచారం చేస్తోందని అన్నారు. చంద్రబాబు సీఎంగా ఉన్నప్పుడే రూ.2 వేల పెన్షన్‌ ఇచ్చారని, ఇప్పుడు వైసీపీ ప్రభుత్వం కేవలం రూ.250 పెంచి గొప్పలు చెప్పుకుంటోందని ఎద్దేవా చేశారు.