వ్యవస్థను కడిగే ముందు.. మనవి మనం కడుక్కోవాలి

వ్యవస్థను కడిగే ముందు.. మనవి మనం కడుక్కోవాలి

11-07-2019

వ్యవస్థను కడిగే ముందు.. మనవి మనం కడుక్కోవాలి

స్పందన కార్యక్రమంలో ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి జగన్‌ మాట్లాడుతూ వ్యవస్థను కడిగేయాలని, అందుకు తన వంతు ప్రయత్నం చేస్తున్నానని వ్యాఖ్యానించారు. అంతే కాకుండా కలెక్టర్లు, ఎస్పీలు కూడా మనసు పెడితే అవినీతి నిర్మూలన సాధ్యమేనని తెలిపారు. దీనికి సంబంధించిన ఓ పత్రికలో వచ్చిన వార్తను తెలుగుదేశం ఎంపీ కేశినేని నాని ట్విట్టర్‌లో షేర్‌ చేసి జగన్‌పై సెటైర్లు వేశారు. వ్యవస్థను కడిగే ముందు మనవి మనం కడుక్కోవాలి జగన్‌ గారు. కడిగిన ముత్యాలు మాత్రమే వ్యవస్థను కడగగలవు. ఈడీ, సీబీఐ కేసులున్న మీరెలా కడగగలరు అని నాటి ట్వీట్‌లో పేర్కొన్నారు.