టీడీపీ హయంలో దేశంలోనే ఏపీ నెంబర్‌ వన్‌ : చంద్రబాబు

టీడీపీ హయంలో దేశంలోనే ఏపీ నెంబర్‌ వన్‌ : చంద్రబాబు

11-07-2019

టీడీపీ హయంలో దేశంలోనే ఏపీ నెంబర్‌ వన్‌ : చంద్రబాబు

ఆంధ్రప్రదేశ్‌ అసెంబ్లీలో కరవుపై చర్చ సందర్భంగా అధికార, ప్రతిపక్ష సభ్యుల మధ్య వాగ్వాదం చోటుచేసుకుంది. 2014 నుంచి 2019 వరకు సున్నా వడ్డీ పథకం కింద ఎంత ఇచ్చారో చెప్పాలని చంద్రబాబుకు ముఖ్యమంత్రి జగన్‌ సవాల్‌ విసిరారు. దీంతో జగన్‌ వ్యాఖ్యలకు చంద్రబాబు కౌంటర్‌ ఇచ్చారు. రాష్ట్రంలో రైతులకు విత్తనాలు ఇవ్వలేని పరిస్థితిలో వైసీపీ ప్రభుత్వం ఉందని తీవ్రస్థాయిలో విమర్శించారు. విత్తనాలు కూడా ఇవ్వలేని జగన్‌ ఈ ఐదేళ్లలో ఏం చేస్తారని ప్రశ్నించారు. జీడీపీ లెక్కలు ఆర్థికమంత్రి, తాను రాసేవి కావని అన్నారు. ఆ విషయం తెలియకుంటే ఇంట్లో కూర్చొని లెక్కలు రాసుకోవాలని ఎద్దేవా చేశారు.

తెలుగుదేశం హయాంలో వ్యవసాయంలో దేశంలోనే ఏపీ నెంబర్‌ వన్‌గా ఉందని అన్నారు. వైఎస్‌ హయాంలో ఆత్మహత్యలు చేసుకున్న 14,500 మంది రైతులకు కూడా పరిహారం ఇవ్వాలని డిమాండ్‌ చేశారు. విపక్షనేతగా ఉన్న జగన్‌ మమ్మల్ని ఎన్నిసార్లు అభినందించారని ప్రశ్నించారు. ఎవరికైనా అధికారులే రికార్డులు ఇస్తారన్నారు. అధికారులు రికార్డులు ఇవ్వకుంటే జగన్‌ చెప్పే పరిస్థితుల్లో లేరని విమర్శించారు.