క్షమాపణ చెబితే.. అభినందనలు

క్షమాపణ చెబితే.. అభినందనలు

11-07-2019

క్షమాపణ చెబితే.. అభినందనలు

ఎమ్మెల్యేలకు నిధులు ఇచ్చే విషయంలో ముఖ్యమంత్రి జగన్‌ నిర్ణయంపై చంద్రబాబు అభినందనలు తెలపాలని మంత్రి పెద్దిరెడ్డి డిమాండ్‌ చేశారు. దీనిపై స్పందించిన చంద్రబాబు కొండేపి ఎమ్మెల్యే స్వామికి జరిగిన అవమానంపై జగన్‌ క్షమాపణలు చెప్పాలని డిమాండ్‌ చేశారు. ఏపీ అసెంబ్లీ సమావేశాలు వాడీవేడీగా సాగుతున్నాయి. అధికార, ప్రతిపక్షాల మధ్య విమర్శలు, ప్రతి విమర్శలు కొనసాగుతున్నాయి. జగన్‌ చెప్పేది ఒకటి... చేసేది మరొకటంటూ చంద్రబాబు విమర్శించారు. ఎస్సీ ఎమ్మెల్యేను వైసీపీ ప్రభుత్వం అవమానించిందని ఆరోపించారు. ఎమ్మెల్యే స్వామికి క్షమాపణ చెబితే ఎమ్మెల్యేలకు నిధుల నిర్ణయాన్ని అభినందిస్తానని అన్నారు. ఎమ్మెల్యేను కూడా దబాయించే పరిస్థితికి వచ్చారని, రౌడీయిజుం చేయాలని చూస్తున్నారని చంద్రబాబు మండిపడ్డారు.