చంద్రబాబు రాజీనామా చేస్తారా ?

చంద్రబాబు రాజీనామా చేస్తారా ?

11-07-2019

చంద్రబాబు రాజీనామా చేస్తారా ?

తెలుగుదేశం హయాంలో రైతులకు సున్నా వడ్డీకి రుణాలే ఇవ్వలేదని ఆంద్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌ తెలిపారు. 2014లోనే ఈ పథకాన్ని నిలిపివేసిన టీడీపీ ప్రభుత్వం రుణమాపీ చేస్తున్నాం కాబట్టి సున్నా వడ్డీకి రుణాలు ఇవ్వబోమని చెప్పిందని వ్యాఖ్యానించారు. అసెంబ్లీలో కరవుపై చర్చ సందర్భంగా ముఖ్యమంత్రి జగన్‌ మాట్లాడుతూ అధ్యక్షా ఈరోజు చంద్రబాబు నాయుడుగారికి ఇక్కడే సవాల్‌ విసురుతున్నా. 2014 నుంచి 2019 దాకా రైతులకు సున్నా వడ్డీ కింద ఎంత రుణాలు ఇచ్చారో చెప్పాలని డిమాండ్‌ చేస్తున్నా. నోరు తెరిస్తే అబద్ధాలే. అధ్యక్షా కావాలంటే నేను రికార్డులు తెపిస్తా, ఆ రికార్డులు తెచ్చి చూపించిన తర్వాత ఆ పదవికి రాజీనామా చేసి ఇంటికి వెళ్లిపోతారా? అని అడగండి అధ్యక్షా రెడీనా నేను ఇప్పుడే అసెంబ్లీలోకి రికార్డులు తెప్పిస్తా అని మండిపడ్డారు. ఈ సంరద్భంగా వైసీపీ సభ్యులు గట్టిగా అరిచారు. దీంతో సభలో గందరగోళం నెలకొంది.