ఆవు అడిగితే... ఎద్దు ఇచ్చారు!

ఆవు అడిగితే... ఎద్దు ఇచ్చారు!

12-07-2019

ఆవు అడిగితే... ఎద్దు ఇచ్చారు!

విశాఖపట్నం రైల్వేజోన్‌ విషయంలో ఆంధ్రప్రదేశ్‌ ప్రజలు ఆవు ఇవ్వాలని డిమాండు చేస్తే కేంద్రం ఎద్దును ఇచ్చిందని తెలుగుదేశం పార్టీ లోక్‌సభా పక్షనేత రామ్మోహన్‌నాయుడు పేర్కొన్నారు. లోక్‌సభలో రైల్వే పద్దులపై చర్చలో భాగంగా ఆయన మాట్లాడారు. ఆంధ్రప్రదేశ్‌లోని వాల్తేరు, విజయవాడ, గుంతకల్లు, గుంటూరు డివిజన్లు కలిపి వాల్తేరు డివిజన్‌ ప్రధాన కార్యాలయంగా జోన్‌ అడిగితే కేంద్ర వాల్తేరు డివిజన్‌ను మూసేయాలని చూస్తోందని ఆరోపించారు. శ్రీకాకుళం జిల్లాలోని పలాస నుంచి ఇచ్ఛాపురం వరకు 4 స్టేషన్లు కొత్తజోన్‌లో చేర్చాలని కోరారు. విశాఖ, విజయవాడ మెట్రోల ఊసు బడ్జెట్‌లో లేకపోవడం బాధాకరమన్నారు. రాష్ట్రంలో 80 కొత్తలైన్లు, 50 డంబ్లింగ్‌ పనులు చేపట్టాల్సి ఉందన్నారు.